B R Ambedhkar Open University | అంబేద్కర్ వర్షిటీ ఎం.బి.ఏ. నోటిఫికేషన్ విడుదల

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు నవంబర్ 15 చివరి తేదీ
Hyderabad : డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) ఎంబిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ కోర్సులో ప్రవేశం పొందడానికి నవంబర్ 15 వరకు చివరి గడువు తేదిగా నిర్ణయించారు.
ఈ మేరకు సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. విద్యార్హతలు, ఫీజు వంటి పూర్తి వివరాలు, ఆన్ లైన్ లో నమోదు వంటి ఇతర అంశాలపై సందేహాల నివ్రుత్తి కోసం తమకు దగ్గరలో ఉన్న అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 7382929570/580, 040-23680222 / 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో సంప్రదించొచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలని వివరించారు.
* అంబేద్కర్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ అడ్మిషన్ల గడువు నవంబర్ 15 వరకు పోడుగింపు
డా బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ , పీ.జీ కోర్సులో ప్రవేశాల కోసం చివరి తేది నవంబర్ 15 వరకు పొడిగించినట్లు బుధవారం ఆ యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజును నిర్ణీత గడువు లోపు చెల్లించాలని, అంతకు ముందు చేరిన విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా నవంబర్ 15వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలని పేర్కొన్నారు.

* * *
Leave A Comment